ఇప్పుడైనా కళ్ళు తెరవండి!

ఉస్మానియావిశ్వవిద్యాలయం లో జరిగిన విగ్రహాల ధ్వంసం గురించి కొంత మంది చాలా ఆవేదనవ్యక్తం చేస్తూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోస్టులు పెడుతున్నారు.

ఆ పోస్టులను సమర్ధిస్తూ, విధ్వంసాన్ని ఖండిస్తూ అనేక మంది చాంతాడంతపొడుగున కామెంట్లు కూడా పెడుతున్నారు.

Saraswati Statue Desecrated in Osmania University

Goddess Saraswati Statue Desecrated in Osmania University

 

వీరందరూ తెలుసుకోవలసినది ఒకటి ఉంది.

మనకి నచ్చని విగ్రహాల విధ్వంసంలో పాల్గొన్నా,

వాటి విధ్వంసం జరుగుతున్నప్పుడు గమ్మున ఊరుకున్నా,

బాగా జరిగింది అని సంతోషించినా,

ధ్వంసం చేసిన వారి ఆవేదన అలాంటిది అని సర్దిచెప్పడానికి చూసినా

మనం పూజించే విగ్రహాల విధ్వంసం కూడా మన కళ్ళతోనే చూడాల్సిన రోజు ఈవేళ కాకపొతే రేపైనా వస్తుంది అని.

సరస్వతీ దేవి విగ్రహం, ప పూ డాక్టర్ జీ విగ్రహాల విధ్వంసాన్ని ఖండిస్తూ,

విభజన వాదుల విధ్వంసకాండని సమర్ధించిన సోదర సోదరీమణులు, వారినిప్రోత్సహించే విస్తారకులు, వారికి మార్గనిర్దేసనం చేసే ప్రముఖులు, కార్యవాహలుఇప్పటికైనా కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాను.

జాతిని కలిపే దీక్ష పథాన్ని విడనాడ వద్దు అని అభ్యర్ధన.

One Response to “ఇప్పుడైనా కళ్ళు తెరవండి!”

  1. May 9, 2013 at 3:45 pm #

    ou lo jarigina gatananu andaru kandistunnaru… kandinchali kuda.. ala ani konthamandi communistulu chesina pani telangana ku mudi pettodu.. telangana prajala jivithalaku sambandichina vishayam… mi lanti vallu ani addankulu spurustinchina telangana ravadam tadyam..

Leave a Reply