నాది మూడవ కన్ను

పురాతన సనాతన గతాన్ని బెంగతో చూసే చక్షువు ఒకటి

భయానక ప్రలయాన్విత భవిష్యత్తును సజీవ మూర్తి గా మలిచి నిలిపే దృష్టి మరొకటి

కాని నాది మూడవ కన్ను

దానికగుపించేది నిత్య నిరంతర నిఖిల వర్తమానం

No comments yet.

Leave a Reply