సర్దుకో లేవు, కానీ …. చెప్పుకోనూ లేవు

 

సర్దుకో లేవు

కానీ ….

చెప్పుకోనూ లేవు

 

ఇవి శ్రావ్యమైన శ్రుతిలో గుసగుసగా వినిపించే ప్రశ్నలు ఒక్క ఉదుటున పడి పేలే పిడుగుల్లాగా కాదు ఇవి

 

అప్పుడే వచ్చినట్టు

తలుపు మెల్లగా తట్టినట్టు

వాకిట్లో తచ్చాడి నట్లు

చిరుగాలికి పండుటాకు రెపరెప లాడి నట్టు

పసిపాపలు నిద్దట్లో ఉండి ఉండి నవ్వినట్లు

కొమ్మ మీద పాల పిట్ట ఆగి ఆగి ఊగినట్టు

 

శ్రావ్యమైన శ్రుతిలో గుసగుసగా వినిపించే ప్రశ్నలు

 

ఏమి కావాలి నీకు?

ఏమి చేయాలి నీవు?

 

ఏమి కావాలో తెలియాలి నీకు

ఏమి చేయాలో నేర్వాలి నీవు

 

అవి తెలియక మనసును సలిపే అయోమయం భరించడం ఇక నీవల్ల కాదు ఇక సర్దుకో లేవు నీవు

 

మనసారా దేన్ని చూసి నవ్వాలి నీవు?

గుండె లోతుల్లో ఏ ప్రతిమను పదిలపరచాలి?

నీ చేయి ఎత్తాల్సిన పతాకమేమిటి?

నీవు పరిగెత్తాల్సిన పందెం జరిగేదేక్కడ?

గెలవాల్సిన పతకమేమిటి?

మలచాల్సిన సమాజ శిల్ప మేమిటి?

 

నీవు మననం చేయాల్సిన మంత్రమేది?

నోచాల్సిన నోము పేరేది?

నీ సాధనతో సాధించే తంత్రమేపాటిది?

నిన్నుశాసించే నియమమేది?

ఏది నీ నిష్ఠ?

నీ అనుష్టానమేది?

 

నీవు వినిపించాల్సిన రాగ మేది?

మోగించాల్సిన నాద మెక్కడ?

ఎక్కడుంది నీవు శృతి చేసే మహతి?

 

అవి తెలియక మనసును సలిపే

అయోమయం భరించడం ఇక నీ వల్ల కాదు

 

ఇక సర్దుకో లేవు నీవు

కానీ

నీవు ఇది చెప్పుకోనూ లేవు

One Response to “సర్దుకో లేవు, కానీ …. చెప్పుకోనూ లేవు”

 1. August 15, 2014 at 9:00 pm #

  sir
  meeru idivarau oka politician gaane telsu
  mruduvaina gaathram unna oka analyst gaa telsu
  mee ee website choosaka meeru kevalam oka politician kaadani
  oka manasunna ..artistic and poetic values unna manishani

  the way you have created your house isha vasyam …aa peru pettadame adbhutham
  mee photos mee videos mee bhaavaalu chaala sunnithamgaa unnai

  adugadugunaa sunnitatvam uttipaduthondhi
  telugudanam sravisthondhi…

  sunnithamgaa untooney..political analyst gaa unnaru
  inchu minchu anni horizons of life touch chesthunnaru
  meeru great sir…meeru inkaa jeevitham paripoornamgaa jeevinchaalani aakankisthunnanu

  sudha

Leave a Reply