ఇటునించి నరుక్కొద్దామనా?

Visalandhra Mahasabha Activists in Abids Police Station

Visalandhra Mahasabha Activists in Abids Police Station


ఎత్తుగడలలో, కుట్రలలో, పన్నాగాలలో విభజన వాదులు సిద్ధహస్తులు.

అబద్దాలు, అభూత కల్పనలు, వక్రీకరణల ఆధారంగా గాలి పోగుచేసి వేర్పాటువాద ఆందోళనని నిర్మించినవారు తక్కువ వారు కాదు. ఇన్నాళ్ళూ విద్వేషాన్ని రెచ్చగోట్టడమే పనిగా పెట్టుకున్న వారు ఇప్పుడు హఠాత్తుగా స్వరం మార్చారు. కొత్త ఎత్తులు వేస్తున్నారు. అకస్మాత్తుగా కోస్తా రాయలసీమ ప్రజల పట్ల ఆ ప్రాంత అభివృద్ధి మీద వల్లమాలిన ప్రేమను ఒలకపోస్తున్నారు.

అటు వైపు నుంచి నరకడం ప్రస్తుతానికి ఆపి ఇప్పడు ఇటువైపు నుంచి నరకడానికి ఈ జిత్తులమారి విభజన వాదులు కత్తులకు పదును పెడుతున్నారు.

నిన్నటి వరకూ తెలంగాణా ఉద్యోగాలని, నీళ్ళని, నిధులని దోచుకుని కోస్తా రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నారు; అక్కడ అన్నీ ఉన్నాయి తెలంగాణా లో చూడండి ఏమీ లేవు అని పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి విద్వేషాలను రెచ్చ గొట్టారు.

ఇప్పుడు కొత్త పల్లవి ఎత్తుకున్నారు.

కోస్తా రాయలసీమల్లో ఏమీ అభివృద్ధి లేదట; ఉత్తరాంధ్ర లో మనుషులు చొక్కాలు కూడా తోడుక్కోలేని స్థితిలో ఉన్నారట; రాయలసీమ లోని బీడు భూములు వీరి హృదయాలను కలచి వేస్తున్నాయట. విడిపోయి కొత్త గా రాజధానిని నిర్మించుకుని, రాయలసీమలో సాగునీటికి, కోస్తాలో తీర ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు రచించి అమలు చేసుకుంటేనే ఆ ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందట. విభజనతోనే కోస్తా రాయల సీమల వికాసం సాధ్యమట. ఉమ్మడి రాష్ట్రంలో ఆ రెండు ప్రాంతాలు చాల నష్టపోయాయట.

అసలు ఇన్నాళ్ళు వీళ్ళు చేసిన ఆందోళన అంతా కోస్తా రాయలసేమల మేలు కోరి ఆ ప్రాంత ప్రజల అభివృద్ధి గురించే చేసినట్టు మాట్లాడుతున్నారు. నాలుకకి నరం లేదంటే ఇదేనేమో!

నిన్నటి వరకూ రాష్ట్ర విభజనని వ్యతిరేకించిన వారిని తెలంగాణ ద్రోహులు అని శాపనార్ధాలు పెట్టారు. బండ బూతులు తిట్టారు. నాలుకలు కోస్తామన్నారు. చేతులు నరుకుతామన్నారు.

ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్నారు.

రాష్ట్ర విభజనని వ్యతిరేకించేవారు కోస్తా రాయలసీమ ప్రాంతాలకి ద్రోహం చేస్తున్నారట!

విభజన వల్ల ఈ రెండు ప్రాంతాలకీ అందబోయే అభివృద్ధి ఫలాలని వారికి దక్కక నివ్వకుండా అడ్డుకునేందుకు సమైక్య వాదులు కుట్ర పన్నుతున్నారట. కోస్తా రాయలసీమ అభివృద్ధి సమైక్య వాదులకి ఇష్టం లేదట. కోస్తా రాయలసీమ ప్రజలు సమైక్య వాదుల మాయలో పడకూదట. ఈ మాటలు అంటున్న వారివి నాలుకలా తాటి మట్టలా?

వీరి ఎత్తుగడ అయితే బాగానే ఉంది.

పాపం ఒకటే లోపం ఉంది ఇందులో.

తెలుగు ప్రజలు ఈ కుతంత్రాన్ని పసికట్టలేరు అనుకోవడంలోనే ఈ జిత్తుల మారి విభజన వాదులు పప్పులో కాలేసారు. తెలుగు ప్రజలు రాష్ట్ర సమైక్యతను కాపాడుకోవాలనే వజ్ర సంకల్పంతో ఉన్నారన్న విషయాన్ని గమనించలేక ఈ వికృత ఆలోచనలు చేస్తున్నారు.

గతంలో లాగే ఈసారి కూడా తెలుగు ప్రజలు విభజనవాదాన్ని పాతేస్తారు.

ఏడు తాడి చెట్ల లోతు పాతరేస్తారు.

మళ్ళీ తలెత్తకుండా కప్పెట్టేస్తారు.

 

6 Responses to “ఇటునించి నరుక్కొద్దామనా?”

 1. August 25, 2013 at 6:27 pm #

  Prabhakar garu, I’m with you and I closely follow and appreciate your efforts. However I think it is most impactful if you stick to analysis and evidence rather than merely post an emotionally bashed reply to arguments people/parties make in favour of separation. I urge you to stick to your great strengths in informing and equipping people of Andhra Pradesh with insights as to why these arguments are wrong rather than resort to hyperbole. I do not want your rigor to give way to rhetoric as it seems to be the case most recently including in this post. Thank you.

 2. August 26, 2013 at 12:59 am #

  I very much appreciate this article – both the spirit and the letter of it.

 3. August 28, 2013 at 6:31 pm #

  Another aspect is the oft repeated invocation of constitution by T-vadis.They assure Seema andhra people that constitution provides enough safe guards for any one to stay any where.If that is the case, the same constitution must have safe guarded their interests from 1956 onwards .Why did not the constitutionally elected representatives take care of the interests of Telanagana?

  • August 29, 2013 at 5:26 pm #

   Mr. Bharadwaj: Not sure what you are referring to.

   Are you speaking about the right to live anywhere in India? If yes, this is applicable to individuals. This could not have helped Telangana to get a fair share of Govt. jobs.

   Are you referring to the future Andhra state’s water rights? Under ISDA, only states can raise water disputes. Telangana not being a state could not have exercised this right.

 4. August 31, 2013 at 4:24 pm #

  When NewDelhi can be the capital of all the citizens staying in various states of India, with whom they do not have geographic boundary, Why not Hyderabad be the permanent joint capital of the two new states which will solve the problem. It is next to impossible for the people of Telangana to stay in A.P as they have been brain-washed enough on language, injustice, jobs etc, by the likes of KCR and others, so let us have two states with Joint Capital. In the long run Let Telangana and Seema-Andhra Will see the futility of investing and coming to Hyderabad and new cities with enough growth will eventually emerge. Let us have a Permanent Joint Capital, and also develop new growth centres in both new states. Once bitten is twice shy.

 5. September 1, 2013 at 5:34 pm #

  నువ్వూ కావాలి…. వాళ్ళూ కావాలి అంటూ యాత్ర చేయడం సమన్యాయం కాదు, చాలా అన్యాయం. పుండు చేసి వెన్న వ్రాయడం లాంటిది. గత పాదయాత్రతొ ఎన్నొ ఆశలు సీమాంధ్రా పై పెట్టుకొని….అధికారం తప్పక వస్తుంది అనుకొని తెలంగాణం చేసి అక్కడా ఇక్కడా పాగా వేద్దామని ఒక దురుద్దేశం. దానికి ఆత్మగౌరవయాత్ర పేరుతో “నయా” నయవంచన.కాంగ్రెస్ హస్తం కత్తితో పొడుస్తుంటే తెలుగుపేరుతొ వున్నపార్టి మా చేతులు బంధించి సహకరించడమా? సిగ్గుచేటు.
  దేశం లొ పౌరులందరూ “సమైఖ్యం” వుండాలని బాల్యం నుంచి గురువులు నేర్పిందాన్ని” ప్రస్తుతం తెలుగుప్రజ కోరుతుంటే తప్పు అయిందా?.
  బిచ్చగాళ్ళు ఖూడా సమైఖ్యం కోసం పాటుపడుతొంటే….
  ఓట్ల బిచ్చగాళ్ళు మాత్రం వెన్నుపోటు పొడుస్తున్నారు…..

  ” కదిలింది ప్రజారధం………..
  సమైఖ్యమే దాని పధం…….
  తెలుగుజాతి అంతా.. కలిసిమెలిసి
  ఉండడమే మనందరికీ… సమ్మతం..
  మారదు ఏనాటికీ ఈ అభిమతం…. !!కదిలింది!!
  ఇంకావుంది….
  యర్రాప్రగడ ప్రసాద్…
  రాజమండ్రి…..

Leave a Reply