ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారితో

ధర్మవరపు గారితో నా పరిచయం, స్నేహం సుమారు రెండు దశాబ్దాల నాటివి. అంతటి స్నేహశీలి, సంస్కారవంతుడు నాకు మిత్రుడవడం నా భాగ్యం. జీవితాన్ని అమితం గా ప్రేమించిఇన వ్యక్తి. మంచి భోజనం, చక్కటి సంభాషణ, దూర ప్రాంతాలకు ప్రయాణాలు, సంగీతం, సాహిత్యం, ఇవన్నీ ఎంతగానో రసించి ఆస్వాదించిన వ్యక్తి. ఎన్ని పద్యాలు నోటికి వచ్చో ఆయనకు. మృదువైన హాస్యం అందించగలరు, ఎదుటి వారి నుంచి అందుకోగలరు.

నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నాకోసం ప్రచారం చేయడానికి వచ్చి ఎండను లెక్కచెయ్యకుండా తిరిగారు.
అప్పటి ఫోటోలు ఇందులో కొన్ని ఇక్కడ పెడుతున్నాను. అవి 1994 నాటివి.

సుమారు సంవత్సరం క్రితం మా ఇంటికి భోజనానికి వచ్చారు. అప్పుడు అమ్మతోటి, నాతోటి, ఇంట్లో మాకు సాయంగా ఉండేవారి తోటీ హాయిగా నవ్వుతూ ఫోటోలు తీయించుకున్నారు. షూటింగ్ నుంచి వచ్చారు తోటి నటుడితో. మేకప్ లో ఉన్నారు.

ఆయన అలాగే గుర్తు ఉండాలి మనందరికీ.

ఎప్పటకీ.

2 Responses to “ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారితో”

 1. May 28, 2014 at 2:44 pm #

  Sir,

  very nice pics.I didnt knew that you contested in elections.But wish you could make it oneday with great aspirations.

 2. May 19, 2015 at 7:01 pm #

  Dear Mr. Prabhakar

  I am Mohan Erra, I have seen the Logo of Godavari Pushkaralu 2015 which was released by the Government , but that logo doesn’t make any sense.. negative points of the newly released logo as follows

  1. The logo doesn’t make any reflections that is for river Godawari, it could be any river or stream.
  2. The logo doesn’t show any Godawari matha statue or symbol.
  3. There is no main land mark or icon structure of Rajahmundry.

  So I have designed a new logo for our Godawari Pushkaralu 2015, please check the attached image file and if you like the new Logo then try to recommend to the Government, Thanks.

  Kind regards
  Mohan Erra
  mobile: 9666037024

Leave a Reply