11-02-2022published_dt 2022-02-11T06:54:12.660Z11-02-2022 12:24:12 IST 2022-02-11T06:54:12.660Z11-02-2022 2022-02-11T06:54:12.660Z - - 11-08-2022
{"history":[{"created_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2022-02-11T06:54:12.660Z"}],"comments":[],"video_status":"1","view_count":373,"status":"active","_id":"620608144cc44728d4600734","category_id":"5bdbf63bd07281474d08ae9a","category_name":"Literature","title":"Poetry of Devulapalli Krishnasastri - Part 02 | Pathana Kutuhalam - 52 |","metatitle":"Poetry of Devulapalli Krishnasastri - Part 02 | Pathana Kutuhalam - 52 |","metadescription":"సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు? చంద్రికలనేల వెదజల్లు చందమామ? ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు? ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?","metakeywords":"Poetry of Devulapalli Krishnasastri - Part 02 ","description":"<!DOCTYPE html>\r\n<html>\r\n<head>\r\n</head>\r\n<body>\r\n<p style=\"text-align: justify;\">సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు? చంద్రికలనేల వెదజల్లు చందమామ? ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు? ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?</p>\r\n<p style=\"text-align: justify;\">ఈ గేయ పాదాలు వింటే, ఇంత లలితమైన పదాలు కృష్ణశాస్త్రి తప్ప మరెవరు రాయగలరు? అని అనిపించక మానదు. సున్నితమైన భావుకత, పద లాలిత్యం, తెలుగు భాషా నుడికారాల ప్రయోగము, సరళమైన సమాసాల కూర్పు, సౌందర్యోపాసన, అమలిన శృంగార ప్రతిపాదన, గుండెలను పిండే విషాద భావాల గాఢమైన వ్యక్తీకరణ కృష్ణశాస్త్రి సాహితీ లక్షణాలు. </p>\r\n<p style=\"text-align: justify;\">\"నిందించడానికీ, కీర్తించడానికీ కాదు. మానవుని మానవునిగా చేయడానికే కావ్య నిర్మాణం\" అన్న ఆయన మాటలు సాహిత్య ప్రయోజనం గురించి ఆయన దృష్టిని చాటుతాయి. </p>\r\n<p style=\"text-align: justify;\">ప్రకృతి అందాన్ని వర్ణించినా, ప్రేయసీ ప్రియుల విరహాన్ని వివరించినా, భక్తి భావాన్ని సాక్షాత్కరింపచేసినా, దేశభక్తిని గుండెల నిండా నింపే గేయాన్ని అందించినా, తను అనుభవిస్తున్న ఆనందాన్ని, పడుతున్న వేదనను, లోనవుతున్న పారవశ్యాన్ని, ఉద్వేగాన్ని అంతే గాఢంగా పాఠకులతో కూడా అనుభవింప చేస్తాయి ఆయన కవితలు, గేయాలు, పాటలు, గద్య రచనలు. </p>\r\n<p style=\"text-align: justify;\">రవీంద్రనాథ్ టాగూర్ తో సాహిత్య సంబంధాలు నెరపిన వాడు కృష్ణశాస్త్రి. బ్రహ్మ సమాజం ప్రచారకునిగా, వ్యవహార భాషోద్యమ కార్యకర్తగా నడుంకట్టి, కలం పట్టి పనిచేసాడాయన. ఆయన సంఘసంస్కర్త. వేశ్యా వివాహ వేదికను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు చేయించాడు. హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందువల్ల ఛాందసులైన బంధువులు ఆయనను వెలి వేసారు. </p>\r\n<p style=\"text-align: justify;\">కృష్ణశాస్త్రి భావకవితోద్యమ అగ్రేసరుడు. ఆంధ్రా షెల్లీగా కిర్తించబడ్డాడు. కృష్ణశాస్త్రి మంచి వక్త. ఆయన పద్య, గేయ పఠనం ఆనాటి సాహిత్య సభలలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. ఆయన వచనం కూడా కవితలాగనే ఉంటుందంటారు సాహితీ విమర్శకులు. </p>\r\n<p style=\"text-align: justify;\">సినిమాలకు ఆయన రాసిన పాటలు, సినిమా పాటలకు సాహిత్య అంతస్థును తెచ్చిపెట్టాయి. </p>\r\n<p style=\"text-align: justify;\">\"తెలుగు దేశపు నిలువుటద్దం బ్రద్దలైంది. షెల్లీ మళ్లీ మరణించాడు. వసంతం వాడిపోయింది\" అని ఆయన మరణించినపుడు శ్రీశ్రీ అన్న మాటలు ఆధునిక తెలుగు సాహిత్యంలో కృష్ణశాస్త్రికి ఉన్న సమున్నత స్థానాన్ని తెలియజేస్తాయి. </p>\r\n<p style=\"text-align: justify;\">ఇవాళ ఆయన కవితలు కొన్ని చదువుకుందాం.</p>\r\n</body>\r\n</html>","tags":"Poetry of Devulapalli Krishnasastri - Part 02 ","url":"/literature/poetry-of-devulapalli-krishnasastri---part-02-|-pathana-kutuhalam---52-|","thumbnailratio":"16_9","english_url":"/literature/poetry-of-devulapalli-krishnasastri---part-02","created_by":"5bdbf59db8fc62471b160869","modified_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2022-02-11T06:54:12.660Z","img_alt_description":"Poetry of Devulapalli Krishnasastri - Part 02 ","short_description":"సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు? చంద్రికలనేల వెదజల్లు చందమామ? ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు? ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?","embedded":"https://www.youtube.com/watch?v=2ZPoz-3N9Gw","english_title":"Poetry of Devulapalli Krishnasastri - Part 02 ","thumbnail1":"/uploads/jsopTrpP93.png","thumbnail2":"/uploads/5lL662CBJc.png","thumbnail3":"/uploads/L3UCm0Ekkr.png","__v":0,"editor_email":"","editor_phone":"","editor_description":"","editor_language_name":"","linkedin_profile":"","facebook_profile":"","twitter_profile":"https://twitter.com/parakala","insta_profile":"https://www.instagram.com/parakala/","user_name":"Parakala","user_img":"/images/author-deafault.png","aurl":"/literature/poetry-of-devulapalli-krishnasastri---part-02-|-pathana-kutuhalam---52-|","published_dt":"2022-02-11T06:54:12.660Z","published_dt_txt":"11-02-2022","published_dt_time_txt":"11-02-2022 12:24:12 IST","updated_dt_time_txt":"11-08-2022 16:08:26 IST"}
సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు? చంద్రికలనేల వెదజల్లు చందమామ? ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు? ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?
ఈ గేయ పాదాలు వింటే, ఇంత లలితమైన పదాలు కృష్ణశాస్త్రి తప్ప మరెవరు రాయగలరు? అని అనిపించక మానదు. సున్నితమైన భావుకత, పద లాలిత్యం, తెలుగు భాషా నుడికారాల ప్రయోగము, సరళమైన సమాసాల కూర్పు, సౌందర్యోపాసన, అమలిన శృంగార ప్రతిపాదన, గుండెలను పిండే విషాద భావాల గాఢమైన వ్యక్తీకరణ కృష్ణశాస్త్రి సాహితీ లక్షణాలు.
"నిందించడానికీ, కీర్తించడానికీ కాదు. మానవుని మానవునిగా చేయడానికే కావ్య నిర్మాణం" అన్న ఆయన మాటలు సాహిత్య ప్రయోజనం గురించి ఆయన దృష్టిని చాటుతాయి.
ప్రకృతి అందాన్ని వర్ణించినా, ప్రేయసీ ప్రియుల విరహాన్ని వివరించినా, భక్తి భావాన్ని సాక్షాత్కరింపచేసినా, దేశభక్తిని గుండెల నిండా నింపే గేయాన్ని అందించినా, తను అనుభవిస్తున్న ఆనందాన్ని, పడుతున్న వేదనను, లోనవుతున్న పారవశ్యాన్ని, ఉద్వేగాన్ని అంతే గాఢంగా పాఠకులతో కూడా అనుభవింప చేస్తాయి ఆయన కవితలు, గేయాలు, పాటలు, గద్య రచనలు.
రవీంద్రనాథ్ టాగూర్ తో సాహిత్య సంబంధాలు నెరపిన వాడు కృష్ణశాస్త్రి. బ్రహ్మ సమాజం ప్రచారకునిగా, వ్యవహార భాషోద్యమ కార్యకర్తగా నడుంకట్టి, కలం పట్టి పనిచేసాడాయన. ఆయన సంఘసంస్కర్త. వేశ్యా వివాహ వేదికను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు చేయించాడు. హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందువల్ల ఛాందసులైన బంధువులు ఆయనను వెలి వేసారు.
కృష్ణశాస్త్రి భావకవితోద్యమ అగ్రేసరుడు. ఆంధ్రా షెల్లీగా కిర్తించబడ్డాడు. కృష్ణశాస్త్రి మంచి వక్త. ఆయన పద్య, గేయ పఠనం ఆనాటి సాహిత్య సభలలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. ఆయన వచనం కూడా కవితలాగనే ఉంటుందంటారు సాహితీ విమర్శకులు.
సినిమాలకు ఆయన రాసిన పాటలు, సినిమా పాటలకు సాహిత్య అంతస్థును తెచ్చిపెట్టాయి.
"తెలుగు దేశపు నిలువుటద్దం బ్రద్దలైంది. షెల్లీ మళ్లీ మరణించాడు. వసంతం వాడిపోయింది" అని ఆయన మరణించినపుడు శ్రీశ్రీ అన్న మాటలు ఆధునిక తెలుగు సాహిత్యంలో కృష్ణశాస్త్రికి ఉన్న సమున్నత స్థానాన్ని తెలియజేస్తాయి.
ఇవాళ ఆయన కవితలు కొన్ని చదువుకుందాం.